Telugu Samethalu Proverbs on life

Telugu Samethalu Proverbs on life


What is the Telugu Samethalu:
సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు. ఆంగ్లంలో సామెతను byword లేదా nayword అని కూడా అంటారు. సామెతలలో ఉన్న భేదాలను బట్టి వాటిని "సూక్తులు", "జనాంతికాలు", "లోకోక్తులు" అని కూడా అంటుంటారు.

సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").

Some Telugu Samethalu/proverbs:

అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు.
అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా.
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.
అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు.
అనువు గాని చోట అధికులమనరాదు.
అభ్యాసం కూసు విద్య.
అమ్మబోతే అడివి కొనబోతే కొరివి.
అయితే ఆదివారం కాకుంటే సోమవారం.
ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం.
ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత.
ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు.
ఇంట గెలిచి రచ్చ గెలువు.
ఇల్లు పీకి పందిరేసినట్టు.
ఎనుబోతు మీద వాన కురిసినట్టు.
చెవిటి వాని ముందు శంఖమూదినట్టు.
కందకు లేని దురద కత్తిపీటకెందుకు.
కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు.
కుక్క కాటుకు చెప్పుదెబ్బ.
కోటి విద్యలూ కూటి కొరకే.
నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు.
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం.
పిట్ట కొంచెం కూత ఘనం.
రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు.
వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక.
కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు.
మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె.
ఆడబోయిన తీర్థము యెదురైనట్లు.
ఆడలేక మద్దెల వోడు అన్నట్లు.
ఆది లొనే హంస పాదు.
ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము.
ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు.
ఆకాశానికి హద్దే లేదు.
ఆలస్యం అమృతం విషం.
ఆరే దీపానికి వెలుగు యెక్కువ.
ఆరోగ్యమే మహాభాగ్యము.
ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట.
ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?..
అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి.
అడగందే అమ్మైనా అన్నము పెట్టదు.
అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు.
ఏ ఎండకు ఆ గొడుగు.
అగ్నికి వాయువు తోడైనట్లు.
ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు.
అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట.
అందితే జుట్టు అందక పోతే కాళ్ళు.
అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు.
అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు.
అప్పు చేసి పప్పు కూడు.
అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా.
అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు.
బతికుంటే బలుసాకు తినవచ్చు.
భక్తి లేని పూజ పత్రి చేటు.
బూడిదలో పోసిన పన్నీరు.
చాదస్తపు మొగుడు చెబితే వినడు,గిల్లితే యేడుస్తాడు.
చాప కింద నీరులా.
చచ్చినవాని కండ్లు చారెడు.
చదివేస్తే ఉన్నమతి పోయినట్లు.
విద్య లేని వాడు వింత పశువు.
చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ.
చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు.
చక్కనమ్మ చిక్కినా అందమే.
చెడపకురా చెడేవు.
చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు.
చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ.
చింత చచ్చినా పులుపు చావ లేదు.
చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట.
చిలికి చిలికి గాలివాన అయినట్లు.
డబ్బుకు లోకం దాసోహం.
దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు.
దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన.
దాసుని తప్పు దండంతో సరి.
దెయ్యాలు వేదాలు పలికినట్లు.
దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు.
దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి.
దొంగకు తేలు కుట్టినట్లు.
దూరపు కొండలు నునుపు.
దున్నపోతు మీద వర్షం కురిసినట్లు.
దురాశ దుఃఖమునకు చెటు.
ఈతకు మించిన లోతే లేదు.
ఎవరికి వారే యమునా తీరే.
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు.
గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట.
గాజుల బేరం భోజనానికి సరి.
గంతకు తగ్గ బొంత.
గతి లేనమ్మకు గంజే పానకం.
గోరు చుట్టు మీద రోకలి పోటు.
గొంతెమ్మ కోరికలు.
గుడ్డి కన్నా మెల్ల మేలు.
గుడ్డి యెద్దు చేలో పడినట్లు.
గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు.
గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా.
గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు.
గుడ్ల మీద కోడిపెట్ట వలే.
గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట.
గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు.
గురువుకు పంగనామాలు పెట్టినట్లు.
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు.
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.
ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు.
ఇంటికన్న గుడి పదిలం.
ఇసుక తక్కెడ పేడ తక్కెడ.
జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట.
కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు.
కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు.
కాకి ముక్కుకు దొండ పండు.
కాకి పిల్ల కాకికి ముద్దు.
కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది.
కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా.
కాసుంటే మార్గముంటుంది.
కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు.
కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును.
కలి మి లేములు కావడి కుండలు.
కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు.
కంచే చేను మేసినట్లు.
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
కందకు కత్తి పీట లోకువ.
కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం.
కీడెంచి మేలెంచమన్నారు.
కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు.
కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు.
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.
కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా.
కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట.
కూటికి పేదైతే కులానికి పేదా.
కొరివితో తల గోక్కున్నట్లే.
కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు.
కొత్తొక వింత పాతొక రోత.
కోటిి విద్యలు కూటి కొరకే.
కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట.
కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు.
కృషితో నాస్తి దుర్భిక్షం.
క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము.
కుడుము చేతికిస్తే పండగ అనేవాడు.
కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు.
ఉన్న లోభి కంటే లేని దాత నయం.
లోగుట్టు పెరుమాళ్ళకెరుక.
మెరిసేదంతా బంగారం కాదు.
మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో.
నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది.
మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు.
మనిషి మర్మము.. మాను చేవ...బయటకు తెలియవు.
మనిషి పేద అయితే మాటకు పేదా.
మనిషికి మాటే అలంకారం.
మనిషికొక మాట పశువుకొక దెబ్బ.
మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు.
మంత్రాలకు చింతకాయలు రాల్తాయా.
మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా.
మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట.
మొక్కై వంగనిది మానై వంగునా.
మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు.
మొసేవానికి తెలుసు కావడి బరువు.
ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి.
ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు.
ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి.
ముంజేతి కంకణముకు అద్దము యెందుకు.
నడమంత్రపు సిరి నరాల మీద పుండు.
నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది.
నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా..
నవ్వు నాలుగు విధాలా చేటు.
నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు.
నిదానమే ప్రధానము.
నిజం నిప్పు లాంటిది.
నిమ్మకు నీరెత్తినట్లు.
నిండు కుండ తొణకదు.
నిప్పు ముట్టనిదే చేయి కాలదు.
నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు.
నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి.
ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు.
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు.
ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు.
బతికి ఉంటే బలుసాకు తినవచ్చు.
ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు.
ఊరు మొహం గోడలు చెపుతాయి.
పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు.
పాము కాళ్ళు పామునకెరుక.
పానకంలో పుడక.
పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట.
పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు.
పండిత పుత్రః పరమశుంఠః
పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు.
పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు.
పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట.
పెదవి దాటితే పృథ్వి దాటుతుంది.
పెళ్ళంటే నూరేళ్ళ పంట.
పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు.
పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట.
పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది.
పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు.
పిచ్చోడి చేతిలో రాయిలా.
పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా.
పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం.
పిండి కొద్దీ రొట్టె.
పిట్ట కొంచెము కూత ఘనము.
పోరు నష్టము పొందు లాభము.
పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు.
పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట.
పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు.
పువ్వు పుట్టగానే పరిమళించినట్లు.
రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము.
రామాయణంలో పిడకల వేట.
రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు.
రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు.
రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు.
రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు.
రౌతు కొద్దీ గుర్రము.
ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు.
చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు.
సంతొషమే సగం బలం.
సిగ్గు విడిస్తే శ్రీరంగమే.
శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు.
శుభం పలకరా వెంకన్నా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ అన్నాడంట!

Funny Telugu Samethalu/proverbs:

అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట!
He says he very well knew what ginger is and it tastes sour like jaggery!

అమాయకునికి అక్షింతలు ఇస్తే ఆవళికి వెళ్ళి నోట్లో వేసుకున్నాడట!
When a person was given rice grains to bless (the couple), he stepped aside and ate it; out of his innocence!

మొహమాటానికి పోయి ముండ కడుపు తెచ్చుకుందట
Being too submissive, a widow gets pregnant.

సిగ్గు లేని వాడికి నవ్వే సింగారం
Laughter is the ornament for the shameless.

శుభం పలకరా పెళ్ళికొడుకు అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చాచింది అన్నాడట
used to describe a person with a negative attitude and when doing something is very pessimistic about it.

దమ్మిడి ముండకి ఏగాణి క్షవరం!
Wasting (shaving off) a lot of money on a petty thing!

ఆవలింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడంట!
It is to be understood that a yawn may lead to another one yawning, but a sneeze does not!

తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట!
The lady asks the tribal priest how in the world can a quarrel begin. The tribal priest replies back, "Get my alms, bitch!

అఆలు రావు గాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట
Someone who doesnt know the ABCs of the event wants an important place in certain event.

అయ్యకు కోపం సంవత్సరానికి రెండు సార్లే వస్తుంది, వచ్చింది ఆరేసి నెలలు ఉంటుంది
Man gets angry only twice a year, each for six months

మన దీపమని ముద్దులాడితే మూతి కాలకుండా వుంటుందా?
If we kiss our candle, doesn't it burn?

అన్నీ తెలిసినమ్మ అమావాశ్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశి నాడు చచ్చిందిట!
Lady who knows all dies early and who knows nothing lives lately!

నిద్ర పోయే వాడిని నిద్ర లేప్పోచు కానీ; నిద్ర పోయిన్నాటు నటిచే వాడిని నిద్ర లేపలెం
You can wake up someone who is sleeping; It is impossible to wake up a person who is pretending to be asleep.

పొమ్మనలేక పొగ పెట్టినట్లు
Instead of directly asking someone to leave, making them leave by starting some smoke

ఊరి కోక కోడి ఇస్తే, ఇంటి కోక ఈక అంట.
Distributing less for more people.

పోన్లే పాపమని పాత బట్ట ఇస్తే; గుడి వెనక  పోయి ఉరి వేసుకుందట
If you give some clothes for a woman, she used that to hand herself.

పేనుకు పెత్తనం ఇస్తే తల అంత గోరికి పెట్టింది అంట.
Giving authority for wrong people.

తాటి చెట్టు కింద కూర్చొని పాలు తగిన అది కళ్ళే అనుకుంటారు
Even if you do right things in wrong place, people will think it as wrong.

అందని ద్రాక్షలు పుల్లన
The grapes you can't eat are sour.

అడగందే అమ్మైనా అన్నం పెట్టదు
Even your mother won't give you food if you don't ask.

ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం
You don't have a wife and she's not pregnant, but your kid's name in Somalingam.

కుక్క కాటుకి చెప్పు దెబ్బ
Tit for tat

తిన్నింటి వాసాలు లెక్కపెట్టు
used when someone who is trusted and helped by a person , cheats his/her benefactor.

 ఆలస్యం ఆమృతం విషం
"A stich in time saves nine".

పరిగెత్తి పాలు తాగే కంటే ణిల్చిఅని నీళ్ళు తాగటం మేలు
Make use of the available things first before you run for the unavailable

చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
(no point in) holding medicinal leaves after burning one's hands

తంతే గారెల బుట్టలో పడ్డాడుట!
He got kicked into a basket of donuts (meaning, prosperity)!

కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందట!
A useless person (braying donkey) has distracted another useless person (grazing donkey), nothing really eventful!

ఆహారానికి ముందు వ్యవహారానికి వెనుక!
First for food, last (later) for work!

ఆకు యెగిరి ముల్లు మీద పడ్డా, ముల్లు వచ్చి ఆకు మీద పడ్డా, చిరిగేది ఆకే!
If a leave falls onto a thorn, or vice versa, it is only the leaf that will be torn!

ఆస్తి మూరెడు ఆశ బారెడు!
Has tiny bit of money, but wants to buy a lot!

అబద్దమైనా అతికినట్టు ఉండాలి!
Even if it's a lie, it has to stick together!

అద్దం అబద్ధం చెప్పదు!
 A mirror does not lie!

అగ్నికి వాయువు తోడైనట్లు
Like Wind supporting fire.(Two enemies tied up to act against)

పిచుక మీద బ్రహ్మాస్త్రం
Refers to situations where one uses disproportionately excessive force on a weak opponent.

మింగటానికి మెతుకు లేదు కాని మీసానికి సంపెంగ నూనె
we don't have a single rice grain to eat,but we want the aromatic oil for the mustache

పొరుగింటి పుల్ల కూర రుచి
Grass on the other side is greener.

అందితే జుట్టు అందక పోతే కాలు
If possible (go for) hair, if not (go for) feet.

ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చింది
A person is suffering to the maximum because of somebody else's cause.

వీధిలో పులి ఇంట్లో పిల్లి
 A Tiger at home, but a cat outdoors.

తూర్పు తిరిగి దండం పెట్టు
Tried everything, all we can do now is turn east and pray.

మొదటికే మోసం మొగుడా అంటే పెసరపప్పు పెళ్ళామా అన్నట్టు
asking people to eat cake when they have no bread

ఇల్లలకగానే పండగ కాదు
If you have finished painting your home, it does not mean that the festival is over.

ఆడది తిరిగి చెడుతుంది, మగవాడు తిరగక చెడతాడు
A woman gets corrupted with too much socializing, and Man gets corrupted with too little

మోసే వాడికి తెల్సు కావడి బరువు
person carrying the sedan chair knows the weight of it.

ఏరిగెటప్పుడు తినొద్దుర అంట్, అద్దుకు తింట అన్నాడట.
 when A suggests to B not to eat while shitting, instead of listening B replies that he will eat with it.

అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని
even though you have all you need, you are unable to make business as your son-in-law doesn't talk good about it

ఊళ్ళో పెళ్ళి కి కుక్కల హడావిడి
Dogs eagerness for village marriage!

Other links:
Recipes
Gold Rate Today
epapers
Crafts
Keywords:
telugu samethalu images with meaning
100 telugu samethalu
50 telugu samethalu
telugu samethalu vivarana
simple telugu samethalu
telugu samethalu wikipedia
telugu samethalu questions and answers
telugu samethalu with emojis
Thanks for Visiting womenspage.in

 
Design by Free Interview Questions | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Press Release Distribution