Vemana Padyalu in English
1
|
Atmasuddhi leni acharamadi ela
Bhandasuddhi leni pakamadi ela Chittasuddi leni sivpujalelara Viswadhaabhiraama, Vinura Vema |
ఆత్మశుద్ధి లేని అచారమది ఏల భాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ది లేని శివ పూజలేలర విశ్వధాభిరామ, వినుర వేమ |
2
|
Anagananaga raga matisayilluchunundu
thinaga thinaga vemu tiyyanundu sadhanamuna panulu samakuru dharalona Viswadhaabhiraama, Vinura Vema |
ఆనగననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ, వినుర వేమ |
3
|
Alpudeppudu palku adamburamu ganu
Sajjanundu palku challaganu Kanchu moginatlu kanakammu mroguna Viswadhaabhiraama, Vinura Vema |
ఆల్పుడెపుడు పల్కు ఆడంబురము గాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మోగినట్లు కనకమ్ము మ్రోగునా విశ్వధాభిరామ, వినుర వేమ |
4
|
Apadaina velanarasi bandhula joodu
bhayamuvela joodu bantu tanamu Pedavela joodu pendlamu gunamu Viswadhaabhuraama, Vinura Vema |
ఆపదైన వేళ నరసి బంధుల జూడు భయమువేళ జూడు బంటు తనము పేదవేళ జూడు పెండ్లము గుణము విశ్వధాభిరామ, వినుర వేమ |
5
|
Antharangamandunaparaadhamulu chesi
manchivaani valene manujudundu itharu lerugakunna neeswaru derugadaa Viswadhaabhiraama, Vinura Vema |
అంతరంగమందు నపరాధములు చేసి మంచివానివలెనె మనుజుడుండు ఇతరు లెరుగకున్న నీశ్వరుడెరుగడా? విశ్వదాభిరామ వినురవేమ. |
6
|
Anni daanamulanu nanna daaname goppa
kanna thalli kante ghanamu ledhu yenna gurune kanna nekkudu ledayaa Viswadhaabhiraama, Vinura Vema |
అన్ని దానములను నన్నదానమె గొప్ప కన్నవారికంటె ఘనులు లేరు ఎన్న గురునికన్న నెక్కువలేదయా విశ్వదాభిరామ వినురవేమ! |
7
|
Chikkiyunna vela simhambunainanu
bakka kukka karachi baadha pettu balimileni vela pamthambu chelladu Viswadhaabhiraama, Vinura Vema |
చిక్కియున్న వేళ సింహంబునైనను బక్కకుక్క చేరి బాధచేయు బలిమిలేనివేళఁ బంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినర వేమ! |
8
|
Chippabadda swaathi chinuku muthyambaaye
neetibadda chinuku neeta galise braapthi kaluguchota phalamela thappuraa Viswadhaabhiraama, Vinura Vema |
చిప్పలోనఁ బడ్డ చినుకు ముత్యం బాయె నీళ్ళలోనఁగలిసి నీరె యాయె ప్రాప్తము గలచోట ఫలమేల దప్పురా విశ్వదాభిరామ వినర వేమ! |
9
|
Chitta suddhi kaligi chesina punyambu
konchemaina nadiyu koduva kaadu vittanambu marri vrukshambunaku nentha Viswadhaabhiraama, Vinura Vema |
చిత్తశుద్ధిగల్గి చేసినపుణ్యంబు కొంచెమయిన నదియు గొదువ కాదు విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినర వేమ! |
10
|
Champadagina yatti sathruvu thana chetha
jikkeneni geedu seyaraadu posaga melu chesi pommanute chaalu Viswadhaabhiraama, Vinura Vema |
చంపఁదగిన యట్టి శత్రువు తన చేతఁ జిక్కెనేని కీడు సేయ రాదు పొసఁగ మేలు జేసి పొమ్మనుటే చావు ! విశ్వదాభిరామ వినర వేమ! |
11
|
Dhanamu goodabetti daanambu cheyaka
thaanu thinaka lessa daachukonaka theneteega goorchi therevari kivvadaa Viswadhaabhiraama, Vinura Vema |
ధనము గూడఁబెట్టి ధర్మంబు సేయక తాను దినకలెస్స దాచుగాఁక తేనె నీఁగె కూర్చి తెరువర్ల కియ్యదా విశ్వదాభిరామ వినర వేమ! |
12
|
Eluka tholu tecchi yedaadi uthikina
nalupu nalupe gaani telupu raadu koyya bomma tecchina kottina balukunaa Viswadhaabhiraama, Vinura Vema |
ఎలుకతోక దెచ్చి యెందాక నుతికిన నలుపుగాక యేల తెలుపు గలుగు కొయ్యబొమ్మ తెచ్చి కొట్టిన గుణియౌనె విశ్వదాభిరామ వినర వేమ! |
13
|
Eddu kainagaani yedaadi thelipina
maata telisi nadachu marmamerigi moppe theliya ledu muppadendlaku naina Viswadhaabhiraama, Vinura Vema |
ఎద్దుకైన గాని యేడాది తెలిపిన మాట తెలిసి నడచు మర్మమెరిగి మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన విశ్వదాభిరామ వినుర వేమ |
14
|
Ganga paaru nepudu kadalani gathi thoda
muriki vaagu paaru mrotha thoda pedda pinna thanamu permi eelaaguraa Viswadhaabhiraama, Vinura Vema |
గంగ పారు చుండు కదలని గతి తోడ ముఱికి కాల్వ పారు మ్రోఁత తోడ దాత యోర్చునట్లధము డోర్వఁగా లేఁడు విశ్వదాభిరామ వినర వేమ! |
15
|
Gangi govu paalu gantedainanu chaalu
kadava dina nemi kharamu paalu, bhakthi kalugu kudu pattedinanu chaalu, Viswadhaabhiraama, Vinura Vema |
గంగిగోవుపాలు గరిటెడైనను జాలు కడివెడైననేమి ఖరముపాలు భక్తిగలుగుకూడు పట్టెడైనను జాలు విశ్వదాభిరామ వినర వేమ! |
16
|
Inumu virigeneni inumaaru mummaaru
kaalchi yathuka vacchu kramamu gaanu manasu virigeneni marikoorpa vacchunaa Viswadhaabhiraama, Vinura Vema |
ఇనుము విఱిగె నేని యినుమాఱు ముమ్మాఱు కాచియతుక నేర్చు కమ్మరీడు మనసు విఱిగెనేని మఱియంట నేర్చునా? విశ్వదాభిరామ వినర వేమ! |
17
|
Puttina janulella bhoomilo nundina
buttunaa jagambu patladepudu yamuni lekkareethi naruguchununduru Viswadhaabhiraama, Vinura Vema |
పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన బట్టునా జగంబు పట్ల దెపుడు యముని లెక్కరీతి నరుగుచు నుందురు విశ్వదాభిరామ, వినుర వేమా |
18
|
Kopamunanu ghanatha konchamai povunu
kopamunanu migula godu galgu kopamadache neni korkeleederu Viswadhaabhiraama, Vinura Vema |
కోపమునను ఘనత కొంచెమై పోవును కోపమునను మిగుల గోడుఁజెందుఁ గోపమడచెనేని గోరిక లీడేరు విశ్వదాభిరామ వినర వేమ! |
19
|
Kalla laaduvaari graamakartha yerugu
sathyamaadu vaani swami yerugu bedda thindipothu bendlaa merunguraa Viswadhaabhiraama, Vinura Vema |
కల్లలాడువాని గ్రామకర్త యెఱుంగు సత్యమాడువాని స్వామి యెఱుంగు బెక్కుతిండిపోతుఁ బెండ్లా మెఱుంగురా విశ్వదాభిరామ వినర వేమ! |
20
|
Medipandu chuda melimai yundunu potta vippi chuda purugulundu piriki vani madini binka meelaaguraa Viswadhaabhiraama, Vinura Vema |
మేడిపండు చూడ మేలిమైయుండును పొట్టవిచ్చి చూడఁ బురుగులుండుఁ పిరికివాని మదిని బింక మీలాగురా విశ్వదాభిరామ వినర వేమ! |
Thanks for Visiting womenspage.in